Revanth Reddy: కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి పెద్దరికం నిలబెట్టుకోవాలి 17 d ago
కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మీ సలహాలు,సూచనలతో సభను నడపండని అన్నారు. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం బాగోలేదని, పాలక పక్షానికి సూచనలు చేయాలని, ప్రశ్నించాలని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే తాము జూనియర్ శాసన సభ్యులమని, కేసీఆర్ ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదన్నారు. ఈ నెల9న కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాలని, పొన్నం వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారని తెలిపారు.